బీఎండబ్ల్యు,  ఆడి కార్ల కంటే ఈ పురుగు ఖరీదు ఎక్కువ.. అది ఏమిటో తెలుసా? 

బీఎండబ్ల్యు,  ఆడి కార్ల కంటే ఈ పురుగు ఖరీదు ఎక్కువ.. అది ఏమిటో తెలుసా? 

బీఎండబ్ల్యు మరియు ఆడికార్ల కంటే ఒక పురుగు ఖరీదుగా ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఒక పురుగును 75 లక్షలరూపాయలతో కొనేవారు ఉన్నారంటే వారు పిచ్చివాళ్లేమో  అని భావించే పరిస్దితి. కాని ఇది నిజం . స్టాగ్ బీటిల్ ( పేడపురుగు)  అనే కీటకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకంగా మారింది.

స్టాగ్ బీటిల్ వుంటే అదృష్టం కలిసి వస్తుందని దానితో ఆకస్మిక సంపద కలిసి వస్తుందనే నమ్మకం ఈ కీటకాన్ని ఖరీదైనదిగా మార్చింది.స్టాగ్ బీటిల్స్ ఔషధాల తయారీలో  కూడా  ఉపయోగించబడుతున్నాయి, అంతేకాదు ఈ కీటకాలు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి కుళ్ళిపోయే ప్రక్రియకు దోహదం చేస్తాయి.మగ స్టాగ్ బీటిల్స్ పొడవు 4 సెం.మీ నుండి 9 సెం.మీ వరకు ఉంటుంది. అయితే ఆడ స్టాగ్ బీటిల్స్ పొడవు 3 సెం.మీ నుండి 4 సెం.మీ వరకు ఉంటుంది. ఆడ స్టాగ్ బీటిల్స్ చిన్న దవడలను కలిగి ఉంటాయిఈ కీటకాల జీవిత కాలం మూడు నుండి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది.

ALSO READ | ఇక్కడి తాబేళ్లు సంథింగ్ స్పెషల్..పూజలందుకుంటాయి.

స్టాగ్ బీటిల్ లో 1200 రకాల జాతులు ఉంటాయి.వీటి తల భాగం నుంచి పొడవైన 2 కొమ్ములు బయటకి పొడుచుకు వస్తాయి.ఇవి చూసేందుకు ఒక సైనికుడు ధరించిన వెపన్స్ లాగా కనిపిస్తాయి.కొన్ని సంవత్సరాల క్రితం జపాన్ దేశంలో ఓ స్టాగ్ బీటిల్‌  లక్షల రూపాయిలకు అమ్ముడుపోయింది.అంతేకాదు దీనికి ఎప్పట్నుంచో భారీ డిమాండ్ ఉంది.

ALSO READ |వానల్లోనే పురుగులు బయటకు ఎందుకొస్తాయి.. మిగతా కాలంలో ఏం చేస్తాయి.. ఎక్కడ ఉంటాయి..?

ముఖ్యంగా జపాన్ లో ఈ పురుగు తమకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుందని విశ్వసిస్తారు. కానీ అక్కడ ఇవి ఎక్కువగా కనిపించవు. కాబట్టి ఈ అరుదైన జాతికి డిమాండ్ పెరిగింది. లక్షలు పెట్టి మరీ సొంతం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు జనాలు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా వీటిని పెంచి డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ చేసారు వ్యాపారస్తులు. మొత్తానికి ఒక్క స్టాగ్ బీటిల్ ధర ప్రస్తుతం రూ. 75 లక్షలకు పైమాటే. కాగా బీఎండబ్ల్యూ, ఆడి కారు కన్నా ఖరీదు అయినదిగా వర్ణిస్తున్నారు.