ఆధార్ కార్డు.. ఇప్పుడు ఇది లేనిదే పని జరగదు..దేనికైనా ఇది గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డే ఆధారం.. వివిధ ప్రభుత్వ సేవలకు అవసమైరమైన పత్రాల్లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు ఫొటోతో కూడిన అడ్రస్ ఉన్న ఐడెంటిటీ కార్డు. అయితే కొందరు ఆధార్ లో ఫొటో సరిగ్గా కనిపించక సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఆధార్ లోని వివరాలను ఫొటోతో సహా ఎప్పుడైనా అప్ డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులోని ఫొటోను ఎలా అప్ డేట్ చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
ఆధార్ కార్డులోని ఫొటో మార్చుకోవడానికి మీ సమీపంలో ఆధార్ శాశ్వత నమోదు కేంద్రానికి వెళ్లాలి. రూ. 100 ల ఫీజు చెల్లించింది ఫొటో అప్డేట్ చేయించుకోవాలి. బయోమెట్రిక్ , ఫొటో అప్ డేట్ లకోసం ఆన్ లైన్ మార్పులు చేయడం సాధ్యం కాదు.
ఆధార్ కార్డు ఫొటో మార్చడం ఎలా ?
- శాశ్వత ఆధార్ సెంటర్ కు వెళ్లాలి.
- ఆన్ లైన్ పలేదా సెంటర్ అందుబాటులో ఉండే ఎన్ రోల్ మెంట్ ఫారమ్ ను నింపాలి
- ఫారమ్ ను సంబంధిత ఆధార్ సెంటర్ నిర్వాహకులకు సమర్పించాలి
- ఎగ్జిక్యూటివ్ మీ ఫొటోను తీస్తారు
- బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేయడానికి రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
డౌన్ లోడ్ చేయడం ఎలా ?
- UIDAI అధికారిక పోర్టల్కి లాగిన్ చేయాలి.
- హోం పేజీలోని MY Aadhaar విభాగంలో డౌన్ లోడ్ ఆధార్ ను ఎంపిక చేసుకోవాలి
- ఈ -ఆధార్ డౌన్ లోడ్ కోసం ఆధార్ నంబర్ఎన్ రోల్ మెంట్ ID , వర్చువల్ ID లలో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలి
- ఇప్పుడు మీరు ఎంపిక చేసిన వివరాలను నమోదు చేయాలి
- మీ రిజస్టర్ ఫోన్ నంబర్ కు OTP ని పంపే ముందు CAPTCHA కోడ్ ను ఎంటర్ చేయాలి.
- ఆధార్ డౌన్ లోడ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు OTP ని ఎంటర్ చేయాలి.
- పాస్ వర్డ్ తో ఈ -ఆధార్ డౌన్ లోడ్ చేయబడుతుంది.
UIDAI ప్రకారం మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు(క్యాప్స్) , మీ పుట్టిన సంవత్సరం ఈ ఇ-ఆధార్ పాస్ వర్డ్ అవుతుంది.