కొన్ని కొన్ని సార్లు మనం చేసే పనులు మనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మనుసుకు హాయిని కలిగించి ఒత్తిడిని తగ్గిస్తుంటాయి. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం, బాధలో ఉన్నవారిని నవ్వించడం, ఇతరులపట్ల మర్యాదపూర్వకంగా ఉండటం, పనుల్లో స్నేహితులు కుటుంబ సభ్యులకు సాయం చేయడం..సమాజంకోసం స్వచ్ఛందంగా పనిచేయడం, చెట్లు నాటడం.. ఇలా కొన్ని మనుసుకు నచ్చిన అర్థవంతమైన పనులు చేయడం ద్వారా మానసికంగా హాయిని కలిగిస్తాయి. ఇలాంటి మంచి పనులు కొనసాగిస్తుంటే..మీ జీవనంలో నాణ్యత మెరుగుపడటమే కాకుండా ఆరోగ్యం గా ఉండేం దుకు ఎంతో సాయంగా ఉంటాయంటున్నారు డాక్టర్లు.
మనం చేసే పనులు మనకు ఎంతో ఉత్సాహాన్ని అందించడమే కాకుండా మనుసుకు హాయిని కలిగించి ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. అది మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గుండెపైనా.ఇలాంటి అర్థవంతమైన పనులు గుండె పనితీరుపై ఎలా ప్రభావం చూపుతాయో వివరణ కూడా ఇచ్చారు. అర్థవంతమైన పని గుండె పనితీరును మెరుగుపరు స్తుందట. మానసికంగా , శారీరకంగా వారి విలువలకు అనుగుణంగా పనిచేస్తే వ్యక్తులు సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు.ఇది శరీరంలోని ఒత్తిడి పెంచే హార్బోన్లను తగ్గిస్తుంది. దీంతో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.అది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెపోటు రాకుండా నివారిస్తుందంటున్నారు.
Also Read : కేకుల తయారీపై బేకరీలకు ప్రభుత్వం వార్నింగ్
అర్థవంతమైన పని చేసే వ్యక్తులు ఒత్తిడి లేకుండా ఉండగలుగుతారట. కొన్ని అధ్యయనాల్లో చేసే పనితో సంతృప్తి చెందిన ఉద్యోగులు కూడా తక్కువ ఒత్తిడిని కలిగి ఉంటారని తేలింది. వారి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిందని అంటున్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు మంచి ఆహారంతీసుకోకపోవడం, శారీరకంగా డల్ గా ఉండటం వంటి చెడు అలవాట్లకు దారితీస్తుందట. ఇష్టంగా పనిచేసినప్పుడు ఒత్తిడిని తగ్గిస్తుందంటున్నారు. కొంతమంది పొగతాగినప్పటికీ, మద్యంసేవించినప్పటికీ, చేసే సంతృప్తి కరమైన పనుల వల్ల వారి హృదయం శక్తి, ఆశావాదంతో నిండి ఉంటుందట.. తద్వారా వారి గుండె పదిలంగా ఉంటుందం టున్నారు.
‘‘అర్థవంతమైన మంచి పనులు,రోజూ వ్యాయామం గుండె పనితీరుకు ఎంతో మంచిది.అలాంటి పనులు చేసేవారు ఆరోగ్యంగా ఉంటారు.సామాజిక సేవ, స్వచ్ఛంద సేవల పాల్గొనడం, సహోద్యోగు లతో సత్సంబంధాలు మనుసుకు హాయిని కలిగించడమే కాకుండా ఒంటరితనాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని’’ ముంబైలోని సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కన్సల్టెంట్ కార్డియాక్ డాక్టర్ బిపిన్ చంద్ర భ్రామే చెబుతున్నారు.