Post Office RD Scheme : మీరు పొదుపు చేయాలనుకుంటున్నారా?.. బెస్ట్ పోస్టాఫీస్ స్కీం ఇదిగో..

Post Office RD Scheme : మీరు పొదుపు చేయాలనుకుంటున్నారా?.. బెస్ట్ పోస్టాఫీస్ స్కీం ఇదిగో..

మీరు పొదుపు చేయాలనుకుంటున్నారా..? మీ సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవ్ చేయాలనుకుంటున్నారా.. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సెక్యూరిటీతోపాటు వడ్డీ రావాలని ఆశించడం కామన్.. మీలాంటి వారికోసం ప్రభుత్వ రంగ సంస్థ అయిన పోస్టాఫీస్ బెస్ట్ స్కీం లను అందిస్తోంది. వీటిలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి.. ఈ స్కీం ద్వారా మన డబ్బుకు భద్రతతోపాటు మంచి రిటర్న్స్ కూడా పొందవచ్చు.  

పోస్టాఫీస్ అందిస్తున్న బెస్ట్ స్కీంలలో రికరింగ్ డిపాజిట్ స్కీం ఒకటి. ఈ పథకాన్ని పలు బ్యాంకులతోపాటు పోస్టాఫీసులో కూడా అందిస్తున్నారు. ప్రతి నెలా ఎంతో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతూ మంచి రిటర్న్స్ ను అందికోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే సంవత్సరానికి 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకం మెచ్చూరిటీ కాలం ఐదేళ్లు.  ఒకవేళ మెచ్యూరిటీ తర్వాత కూడా ఈ స్కీంను కొనసాగింవచ్చు. ఈ స్కీంలో గరిష్టంగా  రూ. 100నుంచి గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. 

ఈ స్కీంలో నెలకు రూ.1000 చొప్పున జమ చేశామనుకోండి.. మెచ్యూరిటీ కాలం తర్వాత ఎంత ఆదాయం పొందుతారో చూద్దాం.. నెలకు రూ. వెయ్యి పొదుపు చేస్తే.. ఐదేళ్ల తర్వాత వడ్డీతో కలిపి రూ. 71 వేలు పొం దుతారు. అలాగే ఈ స్కీంను మరో ఐదేళ్ల పాటు పొడిగించుకొని నెలకు రూ. 1000 చొప్పున జమ చేస్తే పదేళ్ల తర్వాత మీ పెట్టుబడి  రూ. 1.20 లక్షలు అవుతుంది. దీనిపై వడ్డీ దాదాపు రూ.50వేలు వస్తుంది. అంటే మీ చేతికి రూ. 1.70 లక్షలు వస్తాయి.