- పాప బతకాలంటే..రూ.కోటితో వెంటిలేటర్ పెట్టించండి
డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి చనిపోయింది. ఆలస్యంగా తెలిసిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌కండ్ మెడికల్ కాలేజీలో జరిగింది. అన్షికా అహిర్వార్ అనే చిన్నారికి ప్రమాదవశాత్తు వేడి నీళ్లు మీద పడడంతో గురువారం తీవ్రంగా గాయపడింది. తల్లిదండ్రులు వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి… రోజురోజుకీ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు పేరెంట్స్ . జ్యోతి రావత్ అనే డాక్టర్..ఆస్పత్రిలో వెంటిలేటర్ లేదని.. మీ బిడ్డను బతికించాలంటే రూ.కోటి రూపాయలతో దాన్ని ఏర్పాటు చేయాలంటూ వెటకారంగా సమాధానమిచ్చారు. ఇదంతా జరుగుతున్న టైంలోనే ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ విషయం కాస్తా బయటకు తెలియడంతో అక్కడి అధికారులు వెంటనే డాక్టర్ జ్యోతిని సస్పెండ్ చేశారు. ఆస్పత్రి డీన్‌ను వివరణ కోరగా ఆస్పత్రిలో 17 వెంటిలేటర్లు ఉన్నాయని తెలిపారు.
మా పాపకు డాక్టర్లు సకాలంలో సరైన చికిత్స అందించలేదని చిన్నారి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రికి తీస్కెళ్లాలని సూచించారన్నారు. దీంతో అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.