ఛీ ఛీ.. ..అది ఏం పనమ్మా ..డాక్టరమ్మా.. అడ్డంగా బుక్కయ్యావు...

 ఛీ ఛీ.. ..అది ఏం పనమ్మా ..డాక్టరమ్మా.. అడ్డంగా బుక్కయ్యావు...

ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే సమాజానికి భయపడాల్సిందే.  కొన్ని కట్టుబాట్లు.. నియమాలు.. నిబంధనలు పాటించాలి. అవి ఏమీ అక్కర్లేదనుకుంటే సమాజం వారిని చిన్న చూపు చూడటమే కాకుండా.. కొన్నిసార్లు అడ్డంగా బుక్కయి జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంది. వారు లాయర్​ అయినా.. డాక్టర్​ అయినా.. మరెవరైనా సరే పాడు పనులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారా ఒక అంతే.. తాజాగా ఉత్తరప్రదేశ్​ లో ఓ లేడీ డాక్టర్​ చేయకూడని పని చేసి ఊచలు లెక్కిస్తోంది... వివరాల్లోకి వెళ్తే...

ఆమె ఓ డాక్టర్. అందులోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తుంది. ఎంతో మంది రోగులకు చికిత్స అందించి ఆమె.. పాడు పనులు చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయింది.తాజాగా లేడీ డాక్టర్ ఒక్కరితో కాదు.. ఇద్దరు ప్రియుళ్లతో బాత్రూంలో శృంగారం చేస్తూ భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.  భార్యా భర్తలు ఇద్దరు వైద్యులు. భార్య ప్రభుత్వ వైద్యురాలు.  కొంత కాలంగా వీరి కాపురంలో కలతలు రావడంతో దూరంగా ఉంటున్నా   భార్య మాత్రం భర్త దూరంగా ఉన్నాడన్న  బాధ లేకుండా హ్యాపీగా గడుపుతుంది. తనకు కోరికలు కలిగినప్పుడల్లా ప్రియుడితో హోటల్ రూంకి వెళ్లి కోరికను తీర్చుకుంటుంది. ఈ విషయం సూచాయక భర్తకు తెలిసింది. ఆమెను ఎలాగైనా పట్టుకోవాలనుకున్నాడు. 

 తాజాగా డాక్టర్ భార్య.. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి కాసగంజ్‌లోని హోటల్ రూం బుక్ చేసుకుని.. అక్కడకు వెళ్లింది. భార్య ఎలాంటిదో తెలియజేసేందుకు భర్త ఆమె దిగిన హోటల్‌ రూంకి వెళ్లాడు. అక్కడ ఇద్దరు ప్రియుళ్లతో బాత్రూంలో అపభ్యకర స్థితిలో  ఉండగా.. బలవంతంగా గదిలోకి ఎంటరయ్యాడు భర్త. గదిలో లేకపోవడతో బాత్రూంలో చూడగా.. అసలు రంగు బయటపడింది. చూడకూడని  రీతిలో ముగ్గురు కనిపించారు. ఈ మొత్తం ఘటనను భర్త వీడియో రికార్డు చేశారు. అనంతరం ఆమెను చితక్కొట్టి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాక్టర్ భార్యతో పాటు ఆమెతో   దొరికిపోయిన ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఇద్దరి లవర్స్‌ది ఘజియాబాద్, బులంద్ షహర్ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనలో మొత్తంగా ఐదుగుర్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక నెటిజన్లు ఊరుకోరు కదా.. చేతులకు పనిచెప్పి..  కామెంట్స్ చేస్తున్నారు.

పెద్ద పెద్ద చదువులు చదువుకుని.. నలుగురికి ఆదర్శంగా నిలిచే వృత్తిలో ఉన్న వ్యక్తులు సైతం.. వివాహేతర సంబంధాల మోజులో పడి...  లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. భార్య/ భర్త దగ్గర దొరకని సుఖం కోసం పరాయి వ్యక్తుల పంచన చేరుతున్నారు. ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకునే వారు ఈ మధ్య కాలంలో మరింత రెచ్చిపోయే అనేక సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.  సమాజంలో అప్రతిష్ట పాలు అవుతున్నా.. జనాలు పట్టించుకోవడంలేదంటే కొంతమంది ఎంత బరితెగిస్తున్నారో అర్దమవుతుంది. అరే మన సంసారాన్ని పాడు చేసుకుంటున్నామన్న ఇంగిత జ్ఞానాన్ని మరచిపోతున్నారు. క్షణిక సుఖం కోసం భర్తను భార్య, భార్యను భర్త మోసం చేస్తూ కాలం గడిపేస్తున్నారు.