జనగామ, వెలుగు : జనగామకు చెందిన ప్రముఖ డాక్డర్ సీహెచ్ రాజమౌళి కాంగ్రెస్ లో చేరారు. డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిన ఆయనకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు.
వర్ధన్నపేట, (ఐనవోలు) : కాంగ్రెస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పంథినిలో టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ సమక్షంలో రైతు బంధు కన్వీనర్ కంకర శ్రీనివాస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీపాద సతీశ్, అనిల్, సమ్మెట రాజు తదితరులు పాల్గొన్నారు.