రద్దీగా ఉండే ప్రదేశాలైన బస్టాండ్లు, దేవాలయాలు, రైల్వే స్టేషన్లు, జాతర్లు, టూరిస్ట్ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ చాలామంది కనిపిస్తుంటారు. ఇలా భిక్షాటన చేస్తున్న ఓ మహిళకు వింత ఘటన ఎదురైంది. ఆ సంఘటనకు సంబంధించి వీడియో క్లిప్ ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుంది. డాక్టర్ నడుచుకుంటూ వెళ్లుండగా ఒక మహిళ పసిబిడ్డను పట్టుకొని భిక్షాటన చేస్తోంది. దీంతో డాక్టర్ ఆమె దగ్గరికి వెళ్లి తన జేబులోనుంచి కండోమ్ తీసి ఆమెకు ఇచ్చాడు. ఆమె చేతిలో ఉన్న పసిబిడ్డ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది.
దీపావళి పండగ రోజు ఇదంతా వీడియో రికార్డ్ చేసి డాక్టర్ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. రోడ్డు పక్కన ఉన్న భిక్షగాళ్లకు సహాయం చేయడానికి ఇదే ఉత్తమ మార్గమని ఆ డాక్టర్ క్యాప్షన్ లో రాశాడు. పిల్లలకు పెంచడానికి, వారి అవసరాలు తీర్చడానికి స్తోమత లేకుంటే ఇలా ప్లాన్ చేయడం అంటూ డాక్టర్ వీడియో కింద రాశాడు. ఈ వీడియో ఓ అడ్వైస్ లాంటిదని పేర్కొన్నాడు. చాలామంది డాక్టర్ పోస్ట్ మీద విమర్శలు గుప్పించారు. అతను అలా చేయకూడదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతను సోషల్ మీడియా నుంచి ఆ వీడియో డిలెట్ చేశారు. ఈ వీడియో దుర్యోధన్ అనే X యూజర్ అకౌంట్‌లో అప్లోడ్ అయ్యింది. నెటిజన్లు గట్టిగా తిట్టుకొచ్చారు. సెన్సిటీవ్ కంటెంట్ కావటంతో కొన్ని గంటల్లోనే ఆ వీడియో ఎక్స్ నుంచి తొలగించారు.
Also Read : తెలంగాణ రాష్ట్ర పండుగగా సదర్
అయితే కొంతమంది మాత్రం డాక్టర్ చేసిన పనిని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేశారు. పిల్లల్ని పెంచే స్తోమత లేనప్పుడు కనడం ఎందుకు అని ప్రశ్నించారు నెటిజన్లు. తల్లిదండ్రులు వాళ్ల కెరీర్ కాకున్నా.. వాళ్లు పిల్లల భవిష్యత్ ను అయినా ప్లాన్ చేయాలని రాసుకొచ్చారు. అయితే ఆ డాక్టర్ చేసిన పని మీకు ఏం అనిపించిందో కామెంట్ చేయండి.
Haa
— Duryodhan (@Docsauravsingh) October 31, 2024
Do you realise that this video is inappropriate and a doctor shouldn't be sharing such videos. If you wanna share such videos do that without using Dr in your bio and name.
— Dr Ishika (@DrIshika_S24) October 31, 2024