అమ్మాయిలను బడికి పంపేదెలా?

తెలంగాణ వ్యాప్తంగా వయస్సుతో నిమిత్తం లేకుండా అడవాళ్ళ పై అమానుష అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  అభం శుభం తెలియని చిన్నారులనూ వదలడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యపు తీరు, చట్టాలలోని లోపాల ముసుగులో  మగాళ్లు మృగాళ్లుగా మారి స్త్రీల జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. మహిళల సంరక్షణ కోసం  ఎన్ని చట్టాలు చేస్తున్నా అవి బురదలో పోసిన పన్నీరులా మారుతున్నాయి. 

తెలంగాణలో మహా ఘోరం.

తెలంగాణలో క్రైమ్ పెరుగుతోంది. హత్యలు, అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్ లో ఈ పరిస్థితి  చాలా ఎక్కువగా ఉంది. 4 ఏళ్ల పసి పాపపై డి ఎ వి స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ అత్యాచారం సభ్యసమాజం తలదించుకునే విధంగా మన ముందే జరిగింది. ఆలాగే బంజారాహిల్స్ రేప్ కేసులో సాక్షాత్తు  ప్రజా ప్రతినిధుల పుత్రరత్నాలే ఉన్నట్లు వీడియోలు దర్శనమిచ్చాయి. నిర్మల్​లో 60 ఏళ్ల వృద్ధురాలు పై 23 ఏళ్ల యువకుడు చేసిన అమానుషం మహిళా లోకం మర్చిపోదు. మొన్న హయత్ నగర్​లో టెన్త్ క్లాస్ అమ్మాయి పై తోటి విద్యార్థుల సామూహిక హత్యాచారం ....ఇలా చెప్పుకుంటూపోతే జీవితకాలం సరిపోదు. తెలంగాణలో నమోదైన అధికారిక 823 అత్యాచార కేసుల్లో 819 మంది బాధితులకు ఆ నిందితులు పూర్తిగా తెలుసు. మరోవైపు 2021లో తెలంగాణలో మొత్తం నేరాల సంఖ్య 1.45 లక్షల కేసులు. 2020లో 1.35 లక్షల కేసులు  నమోదు కాగా దాదాపు  17951 కేసులు కేవలం హైదరాబాద్ నుంచే ఉన్నాయి. గతం కంటే 10,000 కేసులు ఎక్కువగా పెరిగాయి. తెలంగాణలో 4,365 మంది మహిళలపై దాడులు జరిగాయి. దాదాపు 620 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో అత్యాచార బాధితుల్లో దాదాపు 99.5 శాతం మందికి నేరస్తుల గురించి తెలుసు అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతోంది. 

పసికూనలపై ఇంత పైశాచికత్వమా !

పిల్లలపై జరుగుతున్న ప్రతి మూడు నేరాల్లో ఒకటి లైంగిక నేరం ఉంటోందని తెలిపింది.  పుడమి తల్లికి ఆడపిల్లగా పుట్టకూడదని  శోకించేంతగా మారుతున్న పరిస్థితులకు కారణం ఎవరు?  అన్నింటా సగమై అనడమే కాని.. అన్ని రంగాల్లోనూ వెనుకనే నిలబడింది. దీనికి అనాదిగా మనల్ని పాలిస్తున్న పితృస్వామ్య వ్యవస్థ ఓ కారణమైతే.. ఆర్ధిక, సామాజిక వెనుకబాటుతనం. నిరాదరణలు, అత్యాచారాలు, లైంగిక దాడులతో కూడిన నేటి సమాజం మరో కారణం. సాధారణంగా ఎక్కడైనా అత్యాచారం జరిగితే , దానికి కారణమైన నిందితులను అరెస్ట్ చేసి, బోనులో నిలబెట్టాల్సిన పోలీస్ యంత్రాంగం, ప్రజలు బయటకి వచ్చి చర్యలు తీసుకోవాలని నిరసన ప్రదర్శనలతో డిమాండ్ చేస్తే తప్ప చర్యలు తీసుకోని వ్యవస్థలు మన  తెలంగాణ రాష్ట్రంలో ఉండటం చాలా సిగ్గుచేటు!

ప్రభుత్వాల తీరే మారాలి.. 

రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు, హత్యలు, అత్యాచారాలు లాంటివి జరిగిన వాటిలో సగానికి  పైగా నిందితులపై లిక్కర్ ప్రభావం ఉంటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేరాలకి ప్రధాన కారణమైన లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్ చేయాల్సిన అవసరం  ఎంతైనా ఉంది.  తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదాయం తెచ్చే మార్గంగా చూడవద్దు.పైగా ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటే తప్ప ఖజానాకు దిక్కులేదన్నట్లుగా లిక్కర్​ను బలవంతంగా ప్రజలపై పాలకులు రుద్దుతున్నారు. అశ్లీల ప్రదర్శనలు, చిత్రీకరణలు, టీవీలు, లక్షల్లో ఉన్న పోర్న్ సైట్లు చివరకి సినిమాల్లో కావచ్చు, అరచేతిలో ఉన్న ఫోన్ ఇంటర్నెట్​లో మూలాన మనిషి చెడిపోవడానికి  ఆస్కారం ఉన్నందున నియంత్రణ చర్యలు తీసుకోవాలి. విద్యా వ్యవస్థలో లింగ స్పృహను పెంచేలా మార్పులు చేస్తూ.. అక్షరాస్యత,  ఉద్యోగావకాశాలు, ఉపాధి భద్రత పై దృష్టి పెట్టడం మంచిది. ప్రభుత్వం స్థాపించిన షీ టీమ్స్, హాక్​ ఐ యాప్ లు, హెల్ప్ లైన్ నంబర్ల గురించి అందరికీ తెలిసేలా ప్రచారం చేసి అవగాహన కల్పించాలి. నిర్భయ చట్టం కింద వచ్చిన  నిధులతో పోలీసులకు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కానీ, వారి ఆలోచనా సరళి మాత్రం పెద్దగా మారలేదు. ప్రపంచంలోనే భారతదేశం స్త్రీని గౌరవించే దేశంగా మాటల్లో చెప్పడం కన్నా వారికి సమాన స్థాయిని కల్పించి ఈ దేశం లింగవివక్ష లేని సుసంపన్న దేశంగా కీర్తించబడాలంటే మగాళ్లు- మృగాళ్లలా కాకుండా మనసున్న  మనుషులుగా మారాలి. చిన్నారులపై అత్యాచారాలు పెరుగుతున్న తరుణంలో తల్లిదండ్రులు ఆ పసికూనలను బడికి పంపడమెలా అని ఆలోచించే పరిస్థితులు ఏర్పడినందుకు అందరం చింతించాలి. పాలకులు వాటిని అరికట్టడానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. డాక్టర్. బి.హర్షిణి కేశవులు, ఎంబీబీఎస్ (ఎండీ)