మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఓ లేడీ డాక్టర్ తన భర్త, పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకుంది. నాగ్‌పూర్ కు చెందిన సుష్మా రాణే డాక్టర్ గా పనిచేస్తుంది. ఆమె భర్త ధీరజ్ (42), ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. వీరికి 11 మరియు 5 సంవత్సరాల వయసు గల ఇద్దరు పిల్లలున్నారు. వీరు కొరాడి ప్రాంతంలోని ఓం నగర్ లో నివసిస్తున్నారు. అయితే సుష్మకు ఏం సమస్య ఉందో తెలియదు కానీ.. భర్త, పిల్లలకు విషమిచ్చి తాను కూడా చనిపోయింది. భర్త, పిల్లలకు ఆహారంలో మత్తుమందు కలిపిపెట్టింది. వాళ్లు మత్తులోకి జారకోగానే.. పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చింది. దాంతో వారు ముగ్గురు చనిపోయారు. ఆ తర్వాత ఆమె కూడా ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పిల్లలు ఎవరూ గదిలోనుంచి బయటకు రాకపోవడంతో వీరితో పాటు ఉంటున్న ధీరజ్ వాళ్ల ఆంటీ తలుపు తట్టింది. అయినా కూడా ఎవరూ స్పందించలేదు. దాంతో ఆమె పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా.. అందరూ చనిపోయి ఉన్నారు. ధీరజ్, పిల్లల మృతదేహాలు బెడ్ మీద పడి ఉన్నాయి. సుష్మ ఫ్యాన్ కు వేలాడుతూ ఉంది. పోలీసులు గదిలో సుష్మ రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను సంతోషంగా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని సుష్మా పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు.
For More News..