అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చిన 26 ఏళ్ల గర్భవతి పట్ల ఓ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో వెలుగుచూసింది. స్థానికంగా నివసించే మహిళ స్కానింగ్ కోసం దాద్రి ప్రాంతంలోని విద్యా అల్ట్రాసౌండ్ సెంటర్‌కు బుధవారం మధ్యాహ్నం వచ్పింది. అయితే స్కాన్ చేసే సమయంలో డాక్టర్ తనను అసభ్యంగా తాకాడని.. అంతేకాకుండా ఆయన తన బట్టలను కూడా మార్చుకున్నాడని సదరు మహిళ ఆరోపించింది. స్కాన్ చేసే సమయంలో ఆ డాక్టర్ తాగి ఉన్నాడని.. సహాయకుడిగా ఉన్న మరో వ్యక్తి డాక్టర్‌కు పండ్లు ఇస్తున్నాడని ఆమె తెలిపింది. స్కాన్ రూంలో జరిగిన విషయాన్ని మహిళ బయట ఉన్న తన సోదరునికి చెప్పింది. దాంతో ఆమె సోదరుడు డాక్టరును నిలదీశాడు. ఆ తర్వాత మహిళ తన సోదరునితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డాక్టర్‌పై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని తనకు తెలిసిన వాళ్లతో ఒత్తిడి తెస్తున్నట్లు మహిళ ఆరోపించింది.
గ్రేటర్ నోయిడా ఏసీపీ నితిన్ సింగ్ మాట్లాడుతూ.. ‘విద్యా అల్ట్రాసౌండ్ సెంటర్ డాక్టర్ రాజ్‌బీర్ నగర్ స్కానింగ్ కోసం వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు మాకు ఫిర్యాదు అందింది. నిందితుడిపై ఐపీసీలోని సెక్షన్లు 354 మరియు 323 కింద కేసు నమోదు చేయబడింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది’ అని ఆయన అన్నారు.
గతంలో కూడా డాక్టర్ రాజ్‌బీర్ నగర్‌పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ గర్భవతికి లింగనిర్ధారణ పరీక్షలు చేయడంతో ఆయనపై ఈ కేసు నమోదైంది.
For More News..