మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో గల ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడు(45) నగ్నంగా తిరుగుతూ హల్ చల్ చేశాడు. బిడ్కిన్ గ్రామీణ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యుడు ఆసుపత్రి ఆవరణలో నగ్నంగా తిరుగుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అతని అకృత్యాలు చూడలేక వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి బంధువులు అక్కడినుంచి పరుగులు తీశారు.
వైరల్ అవుతున్న వీడియోలో డాక్టర్ ఆసుపత్రి లాబీ అంతా నగ్నంగా తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. తడబడుతూ నడుస్తూ చేతిలో గుడ్డ పట్టుకుని ఆవరణలో తిరుగుతూ కనిపిస్తున్నాడు. ఆ దృశ్యాలు ఆస్పత్రి ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
सीसीटीवी में कैद : महाराष्ट्र के अस्पताल में नग्न घूम रहा 'नशेड़ी' डॉक्टर! #maharastra #dr #hospital pic.twitter.com/iLZIpZNZzO
— Newsbpbharat (@newsbpbharat) March 10, 2024
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆరోగ్య సేవలను పర్యవేక్షిస్తున్న జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ దయానంద్ మోతిపావ్లే తెలిపారు. నేరం రుజువైతే వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపడతామని వెల్లడించారు. ఆ సమయంలో వైద్యుడు మద్యం మత్తులో ఉన్నాడని రోగులు చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి.