- 2020 జులై 29న రాజీనామా చేసిన శ్రీనివాసరావు
- మళ్లీ అదే స్థానంలో పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం
వరంగల్: ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనాకు ముందు సూపరింటెండెంట్ పదవికి రాజీనామా చేసిన డాక్టర్ బత్తుల శ్రీనివాస్ ను తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైద్య ఆరోగ్య శాఖ. కరోనా విపత్కర సమయంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి, వైద్య సేవలను గాడిలో పెట్టిన డాక్టర్ చంద్రశేఖర్ ను మార్చడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎంజీఎంలో మెడిసిన్, రెమిడీసివర్ ఇంజెక్షన్ల కుంభకోణం బయటకు తీయడం వల్లే ఆయన్ను ట్రాన్స్ ఫర్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్న టైంలో చంద్రశేఖర్ ను కీలకమైన సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి తప్పించడంపై జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.