జువాలజీలో ప్రొఫెసర్ స్వామికి డాక్టరేట్

జువాలజీలో ప్రొఫెసర్ స్వామికి డాక్టరేట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ​ప్రొఫెసర్ ​జిలకర స్వామికి జువాలజీలో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ప్రొఫెసర్ ​జి.సునీతాదేవి పర్యవేక్షణలో కృష్ణ బొచ్చె చేపలో పెరుగుదల, ఆహార మార్పిడి సామర్థ్యం, జీవ రసాయన మార్పులపై ‘సోమాటో ట్రోపిన్’​ హార్మోన్ ​ప్రభావం అన్న అంశంపై ఆయన పరిశోధన చేశాడు.

 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన జిలకర స్వామి స్థానిక రెసిడెన్షియల్​ స్కూల్​లో పదో తరగతి వరకు చదివారు. ఆ తర్వాత మోత్కూర్​జూనియర్​ కాలేజీలో ఇంటర్, నల్గొండ నాగార్జున కాలేజీలో డిగ్రీ, ఓయూలో జువాలజీలో పీజీ, బీఈడీ పూర్తి చేశారు. 

2008లో జూనియర్​లెక్చరర్ గా ఎంపికై..  నిజామాబాద్, మోత్కూర్, కోదాడలో పనిచేశారు. 2012లో సెట్, 2014 లో నెట్​కు అర్హత సాధించారు. అనంతరం డిగ్రీ లెక్చరర్​గా ఉద్యోగం సాధించి కోదాడ, నల్గొండలో పనిచేశాడు. ఇటీవల జువాలజీలో స్వామి రాసిన రీసెర్చ్​ పేపర్లు అంతర్జాతీయ జర్నల్స్​లో ప్రచురితమవ్వడం విశేషం. పీహెచ్​డీ పట్టా పొందిన స్వామిని ఖైరతాబాద్​ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్​ డాక్టర్ ​రాజేంద్ర కుమార్​, వైస్​ ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు.