పసరగొండ వాసికి డాక్టరేట్‌‌

ఆత్మకూరు (దామెర) వెలుగు : హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన ఐత చేరాలుకు డాక్టరేట్‌‌ దక్కింది. రిటైర్డ్ ప్రిన్సిపాల్‌‌ డాక్టర్ ఎం.సత్యవతి ఆధ్వర్యంలో చేరాలు ‘ఎఫెక్ట్ నెస్ ఆఫ్ కస్టమర్ సర్వీసెస్ ఇన్‌‌ కమర్షియల్ బ్యాంక్స్‌‌ కంపారిటివ్‌‌ స్టడీ’ అనే అంశంపై పరిశోధన చేయడంతో కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్‌‌ ప్రకటించింది. డాక్టరేట్‌‌ పొందిన చేరాలును గ్రామస్తులు అభినందించారు.