నారాయణపేట, వెలుగు : నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో డాక్టర్లు బుధవారం అరుదైన నోటి సంబంధిత ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. మద్దూరు మండలం చింతల్ దిన్నె గ్రామానికి చెందిన నందిని(18) నోటి సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి రాగా, ఆమెను పరీక్షించిన డాక్టర్లు నాలుక కింద ఏర్పడిన గడ్డలను తొలగించాలని నిర్ణయించారు.
బుధవారం గంట పాటు శ్రమించి ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. నోట్లో లాలాజల గ్రంథులు మూసుకుపోవడంతో నాలుక కింద గడ్డలా ఏర్పడతాయని, ఇది టంగ్ క్యాన్సర్ కు దారితీస్తుందని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రంజిత్ తెలిపారు. డాక్టర్లు మల్లికార్జున్, నీలవర్ణ , విజయలక్ష్మి ఆపరేషన్ చేసిన వారిలో ఉన్నారు.