సైఫ్ అలీఖాన్ మెడిక్లైయిమ్ ను వ్యతిరేకించిన డాక్టర్ల సంఘం.. ఏమైందంటే..

సైఫ్ అలీఖాన్ మెడిక్లైయిమ్ ను వ్యతిరేకించిన డాక్టర్ల సంఘం.. ఏమైందంటే..

కత్తి పోట్లతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ మెడికల్ క్లయిమ్ వ్యవహారం హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే.. ఈ అంశంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న క్రమంలో ముంబైకి చెందిన డాక్టర్ల సంఘం కూడా సైఫ్ అలీఖాన్ మెడిక్లైయిమ్ ను వ్యతిరేకిస్తూ ఐఆర్డీఏ ( IRDAI ) కి లేఖ రాయటం చర్చనీయాంశం అయ్యింది.  సైఫ్ 25 లక్షల రూపాయల మెడికల్ ఇన్సురెన్స్ క్లైయిమ్ చేసుకోవటం వ్యతిరేకించింది ముంబైకి చెందిన అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్స్ ( AMC ). సైఫ్ కి అంత పెద్ద మొత్తంలో మెడిక్లైయిమ్ ఇవ్వటం, అందులోనూ అంత త్వరగా ఎలా క్లెయిమ్ మంజూరు చేస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.

సామాన్యులకు క్లెయిమ్స్ మంజూరు చేయటంలో ఆలస్యం చేసే ఇన్సూరెన్స్ కంపెనీలు సైఫ్ కి మెరుపు వేగంతో క్లెయిమ్ మంజూరు చేయటం వెనక కారణం ఏంటని ప్రశ్నించింది ఏఎంసీ. ఇదిలా ఉండగా... సెలబ్రిటీ కాబట్టి  ఇన్సురెన్స్ కంపెనీలు వెంటనే క్లెయిమ్ రిలీజ్ చేస్తాయి. అదే ఒక కామన్ మ్యాన్ కు అయితే కంపెనీలు ఇంత ఈజీగా క్లెయిమ్ చేసిన మొత్తాన్ని ఇస్తాయా నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.

అయితే.. సైఫ్ మెడిక్లైయిమ్ మంజూరు చేసిన ఇన్సూరెన్స్ కంపెనీ నివా భూపా ఈ అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. పేషేంట్ జాయిన్ అయ్యే హాస్పిటల్, తీసుకునే ట్రీట్మెంట్, అడ్మిట్ ఐయ్యే రూమ్ ని బట్టి కూడా క్లెయిమ్ అమౌంట్ మారుతుందని స్పష్టం చేసింది. 

ALSO READ | సైఫ్ అలీఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడం లేదట.. !