నారాయణపేట, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో సమీక్ష నిర్వహించారు.
ఆస్పత్రుల్లో పరిశుభ్రతను పాటించాలని, స్టాఫ్ నర్సుల పనితీరు మెరుగుపరచాలని అన్నారు. స్టాఫ్ అందరూ టైం పాటించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంజిత్ కుమార్, అర్ఎంఓ పావని తదితరులు పాల్గొన్నారు.