గాంధీ డైట్ క్యాంటీన్​లో.. నిలిచిన డ్రైనేజీ నీరు

పద్మారావునగర్​, వెలుగు:  గాంధీ ఆస్పత్రిలో పేషెంట్లు, డాక్టర్లకు ఫుడ్ తయారు చేసే డైట్​క్యాంటీన్ లో​ అపరిశుభ్రత నెలకొంది. కిచెన్ ముందు డ్రైనేజీ నీరు పారుతుండగా దుర్గందపూరితంగా తయారైంది. వెంటిలేషన్​ లేని మెయిన్​ బిల్డింగ్​ సెల్లార్​ లోని  క్యాంటీన్​లో  సిలిండర్లను వాడుతుండడం ఆందోళన కలిగిస్తుంది.  రూ 2.70 కోట్లతో నిర్మించిన కొత్త డైట్​క్యాంటీన్​ బిల్డింగ్​ ను గత నెల 20న  మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు.

ALSO READ:రూ.లక్ష రుణమాఫీ చేయాల్సిందే : రైతుల డిమాండ్ 

20 రోజులు గడిచినా ఇంతవరకు కొత్త బిల్డింగ్ లోకి క్యాంటీన్​ ను షిప్ట్​ చేయలేదు. బిల్డింగ్​ లో మైనర్​ పనులు పూర్తి కాకపోవడంతో పాటు వంటలకు సంబంధించిన స్టీమ్​ లైన్​ టెస్టింగ్​చేస్తున్నట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరగా కొత్త బిల్డింగ్ లోకి డైట్​క్యాంటీన్​ను షిప్టింగ్ చేసినట్లయితే ఇబ్బందులు తప్పుతాయి.