ఇండోర్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ డాక్టర్లు ఓ మహిళ కడుపు నుంచి 15 కిలోల కణితి(Tumour)ని సర్జరీ చేసి బయటకు తీశారు. కడుపు నొప్పితో ఆ మహిళ ఇండెక్స్ ఆస్పత్రిలో చేరింది. 41 ఏళ్ల ఆ మహిళ కడుపులో ఉన్న కణతిని తీసేందుకు రెండు గంటలకుపైగా సమయం తీసుకని సర్జరీ విజయవంతం చేశారు వైద్యులు.
దాదాపు 12 మంది డాక్టర్లు ఆపరేషన్ చేసిన బృందంలో ఉన్నారు. డాక్టర్ అతుల్ వ్యాస్ నేతృత్వంలో జరిగిందీ ఆపరేషన్. కణతి కడుపు లపల ఉన్నప్పుడు బాధిత మహిళ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని డాక్టర్లు తెలియజేశారు. నడిచేటప్పుడు, భోజనం చేసే సమయంలో కణతి వల్ల పేషెంట్‌కు ఇబ్బందులు తలెత్తినట్లు చెప్పారు.
మహిళ సుమారు 49 కేజీల బరువు ఉందని, కానీ ఆమె కడుపులో ఉన్న కణితి 15 కేజీల ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. కణతి వల్ల కడుపులో వాపు వచ్చిందని, అయితే అది పగలలేదని, లేదంటే ఆమె ప్రాణాలకు ముప్పు ఉండేదన్నారు. కడుపులో కణతిని ఓవేరియన్ ట్యూమర్‌గా ఇండెక్స్ గా డాక్టర్లు గుర్తించారు.