కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం గురించి వినే ఉంటారు. కానీ.. ఆపరేషన్ చేసి పురీషనాళం (పెద్ద పేగులో మలం చివరగా నిల్వ ఉండే ప్రదేశం) నుంచి సొరకాయ బయటకు తీయడం గురించి విన్నారా..? వినడానికే వింతగా ఉంది కదూ. మధ్యప్రదేశ్లో సరిగ్గా ఇదే జరిగింది. 2 గంటల పాటు వైద్యులు తీవ్రంగా కష్టపడి శస్త్రచికిత్స చేసి 60 ఏళ్ల వృద్ధుడి పురీషనాళంలో ఉన్న 16 అంగుళాల సొరకాయను బయటకు తీశారు. ఈ ఘటన ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లో 60 ఏళ్ల వయసున్న ఒక రైతుకు కడుపు నొప్పి విపరీతంగా రావడంతో నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో చేరాడు. డాక్టర్లు ఆ వృద్ధుడికి వైద్య పరీక్షల్లో భాగంగా ఎక్స్-రే తీశారు. ఆ ఎక్స్-రేను పరిశీలించగా పురీషనాళంలో ఆకుపచ్చ రంగులో సొరకాయ మాదిరిగా కనిపించింది.
ALSO READ | Health News: ప్యానిక్ అటాక్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..
మెడికల్ టీంలోని డాక్టర్.మనోజ్ చౌదరి, డాక్టర్.నంద్ కిషోర్, డాక్టర్.సంజయ్ మౌర్య ఆ వృద్ధుడికి 2 గంటల పాటు శ్రమ పడి ఆపరేషన్ చేశారు. ఆ వృద్ధుడి పురీష నాళంలో ఉన్న 16 అంగుళాల సొరకాయను బయటకు తీశారు. ఆ పేషంట్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, కోలుకుని క్షేమంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. అసలు సొరకాయ పురీష నాళం వరకూ ఎలా వెళ్లి ఉండొచ్చని వైద్యులను ఆరా తీయగా అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని చెప్పారు. అసలు ఇలా ఎలా జరిగిందని వైద్యులు ఆ రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆ వృద్ధుడు సరిగా స్పందిచలేదు.