సర్జరీ లేకుండనే రెండు ఇంచుల మేకును తీసిన్రు

నల్గొండ జిల్లాలో వైద్యులు అరుదైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. మూడేళ్ల బాలుడు రెండు ఇంచుల మేకును మింగేశాడు. మేకు ఛాతిలో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో బాలుడి ఆరోగ్య పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు పట్టణంలో ఆర్కే ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ కీర్తిరెడ్డి బృందం సర్జరీ లేకుండానే ఎండోస్కోప్ ద్వారా మేకును బయటకు తీశారు. ప్రస్తుతం బాలుని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. తమ పిల్లాడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ కీర్తిరెడ్డికి.. అతడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.