- మిస్టరీ మరణాలు ఆగకపోవడంతో ప్రభుత్వం నిర్ణయం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజౌరీ జిల్లా బాధాల్ గ్రామంలో మిస్టరీ మరణాలు ఆగకపోవడంతో అక్కడి వైద్యసిబ్బందికి సెలవులు రద్దు చేసింది. తాజాగా రాజౌరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అమర్జీత్ సింగ్ భాటియా మీడియాతో మాట్లాడారు. "నెలన్నరలో 17 మంది అంతుచిక్కని వ్యాధితో చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అందుకే రాజౌరీ జిల్లాలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి వైద్యసిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నం" అని భాటియా చెప్పారు.