మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమం

మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమం

అలంపూర్, వెలుగు: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. రెండు రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్ రాగా  హైదరాబాద్ లోని నిమ్స్  ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.  

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ రాములు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, గద్వాల్ మాజీ జడ్పీ  చైర్మన్ సరిత తిరుపతయ్య, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులుపరామర్శించారు.