బాలింతను సీపీఆర్​ చేసి కాపాడిన డాక్టర్లు

బాలింతను సీపీఆర్​ చేసి కాపాడిన డాక్టర్లు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: కాన్పు అనంతరం గుండెపోటు వచ్చిన బాలింతకు సీపీఆర్  చేసి కాపాడినట్లు జీజీహెచ్  సూపరింటెండెంట్ సంపత్ కుమార్  సింగ్  తెలిపారు. బాలానగర్ కు చెందిన మేరి గత నెల 20న ఆసుపత్రిలో చేరగా, సిజేరియన్  చేసినట్లు చెప్పారు. డెలివరీ అయిన మరుసటి రోజు బాలింతకు దగ్గు, ఆయాసం, నోట్లోంచి నురగ రావడంతో పాటు కార్డియక్  అరెస్ట్  అయిందన్నారు. 

వెంటనే స్పందించిన ఓబీజీ విభాగం డాక్టర్లు సీపీఆర్  చేసి ప్రాణాలు కాపాడినట్లు వివరించారు. ఆ తరువాత వెంటిలేటర్ పై వైద్యం అందించామని, పూర్తిగా కోలుకోవడంతో బుధవారం ఆమెను డిస్చార్జ్​ చేసినట్లు తెలిపారు. బాలింతకు చికిత్స అందించిన ఓబీసీ విభాగం డాక్టర్లు సంగీత షా, లక్ష్మీ పద్మప్రియ, ఆశాజ్యోతి, స్ఫూర్తి రెడ్డి,  శృతి, మనీషా, రోజా, అనస్థీషియా విభాగం డాక్టర్  మాధవి, భగవతి తదితరులను సూపరింటెండెంట్​

 అభినందించారు.