బర్గర్‌లని, పిజ్జాలని, ఫాస్ట్ ఫుడ్‌లని ఇష్టంగా తింటుంటారు చాలామంది. అయితే వాటిని ఇంతలా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడం లేదు. జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కొలరెక్టల్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు డాక్టర్ అమిత్ జావెద్.
కొలరెక్టల్ క్యాన్సర్ బారిన ఏటా చాలామంది పడుతున్నారు. ఇది పేగు, పురీషనాళాలను పాడు చేస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఇచ్చిన నివేదిక ప్రకారం కొలరెక్టల్ క్యాన్సర్ అనేది క్యాన్సర్‌లో మూడవ ప్రాణాంతకమైన జబ్బు. ఎక్కువ
క్యాన్సర్ మరణాల్లో ఏడవది. గుర్తించొచ్చు ఇలా...
ఈ క్యాన్సర్ లక్షణాలు వెంటనే బయటికి కనిపించవు. అయినా ఎలా గుర్తించాలంటే.. తరచూ డయేరియా, మలబద్ధకం, పేగుల్లో కదలికలు, మలం గోధుమ, నలుపు రంగులో ఉండి రక్తం వచ్చినా లేదా పూర్తిగా రక్తంతో రావడం, తరచూ పొత్తి కడుపులో నొప్పి, అలసట, బద్ధకం, బరువు తగ్గడం అనేవి కొలరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి. టెస్టులు చేయించుకొని ఉన్నదో లేదో తెలుసుకోవాలి.
కొలరెక్టల్ క్యాన్సర్ వల్ల శరీరంలో రక్తం బాగా పోతుంది. రక్త హీనత ఉందని కణాలు తగ్గాయని బ్లడ్ టెస్ట్ చేయించుకొని తెలుసుకోవచ్చు. ఇది అనీమియాకు కారణం అవుతుంది. రక్త కణాల సంఖ్య తగ్గడం కూడా ఒక లక్షణమే. వివిధ స్టేజ్‌ల్లో క్యాన్సర్ పెరుగుతుంది. మెటాస్టేసెస్ అని పిలవబడే అవయవాలకు (మూత్రాశయం, రొమ్ము, కోలన్, కిడ్నీ) ప్రైమరీ కోలన్ అనే క్యాన్సర్ సెల్ వ్యాప్తి చెంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, కాలేయం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
కారణాలు ఏంటంటే...
శరీరంలో కొలరెక్టల్ క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో జెనటిక్, వయసు, కొవ్వు పదార్థాలు తినడం, అల్సరేటివ్ కొలిటిస్ ( పేగుల్లో పుండ్లు), క్రోన్స్ వ్యాధి (పొత్తి కడుపు నొప్పి, డయేరియా, బరువు తగ్గడం) ముఖ్యమైనవి. ఇవే కాకుండా అన్‌హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల పోషకాహారం, శారీరక శ్రమ సరిగ్గా లేకపోవడం, మధుమేహం, ఊబకాయం కూడా ఉన్నాయని జెనెటిక్స్ చెప్తోంది. ఈ కారణాల వల్ల కొలరెక్టల్ క్యాన్సర్ వస్తుంది.
వెంటనే ట్రీట్మెంట్
కొలరెక్టల్ క్యాన్సర్ లక్షణాలను ముందు గుర్తించడం చాలా కష్టం. దీన్ని గుర్తించిన తరువాత కూడా పేగులనుండి పక్క భాగాలకు క్యాన్సర్ కణాలు సోకే ప్రమాదం ఉంది. వాటిని గుర్తించి దానికి తగ్గ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.
- దీన్ని క్యాన్సర్ ఇన్ సిటు అని కూడా అంటారు. ఈ క్యాన్సర్ కణాలు పెద్దపేగు లేదా పురీషనాళాల్లోని బయట లేదా లోపలి పొరల్లో మాత్రమే ఉంటాయి.
- క్యాన్సర్ మ్యుకోసా (లోపలి పొర)లో ఉండి పెరుగుతుంది. అక్కడి నుండి పేగులు, పురీషనాళ కండరాలపైన దాడి చేస్తుంది. అక్కడి నుండి ఊపిరితిత్తుల వరకు వ్యాపించి కణతి కణాలు పెరిగేలా చేస్తుంది.
- ఈ క్యాన్సర్ ఉందని తేలితే సరైన చికిత్స తీసుకోడానికి చాలా రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. బయాప్సితో కొలనోస్కోపి టెస్ట్ చేయించి రోగాన్ని గుర్తించొచ్చు. సిటి స్కాన్, పిఇటి స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. మలంతో ఎంఆర్‌ఐ, ట్రాన్స్‌రెక్టల్ అల్ట్రాసౌండ్ కూడా చేయొచ్చు. సిఇఎ (కోర్సియోఎంబ్రియోనిక్ యాంటీజెన్) టెస్ట్‌తో కొలరెక్టల్ కణతులను రక్త పరీక్ష ద్వారా గుర్తించొచ్చు.
- సర్జరీ, కీమోథెరపీ, రేడియో థెరపీ, ఇమ్యునోథెరపీ అనేవి కొలరెక్టల్ క్యాన్సర్‌కు చికిత్స. సర్జరీ లాప్రోస్కోపిక్ టెక్నిక్ ద్వారా చేస్తారు. దీనివల్ల రోగి తొందరగా రికవరీ అవుతారు. ఈ సర్జరీ తరువాత ట్యూమర్ కణాలు ఉత్పత్తి అవుతున్నాయా? లేదా? అని గమనించేందుకు అబ్జర్వేషన్‌లో ఉంచుతారు.