O పాజిటివ్ కి బదులుగా AB పాజిటివ్ రక్తం ఎక్కించిన డాక్టర్లు... మహిళ పరిస్థితి విషమం...

O పాజిటివ్ కి బదులుగా AB పాజిటివ్ రక్తం ఎక్కించిన డాక్టర్లు... మహిళ పరిస్థితి విషమం...

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన మహిళకు O ఓజిటివ్ రక్తానికి బదులుగా AB పాజిటివ్ రక్తాన్ని ఎక్కించటంతో మహిళ పరిస్థితి విషమంగా మారింది. ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తీ వివరాలు ఇలా ఉన్నాయి... రంగారెడ్డి జిల్లా నోముల గ్రామానికి చెందిన మేఘన అనే 23ఏళ్ళ వివాహిత గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ హాస్పిటల్ లో తీసుకుంటోంది. మేఘనకు వైద్యపరీక్షలు చేసిన లిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు ఆమెకు AB పాజిటివ్ రక్తం ఎక్కించారు.

Also Read:మహబూబ్ నగర్ లో 75 అక్రమ నిర్మాణాలు కూల్చివేత

రక్తం ఎక్కించినప్పటికీ మేఘన ఆరోగ్యం మెరుగవ్వకపోగా ఇంకా క్షీణించింది. దీంతో బాధితురాలు ఉస్మానియా హాస్పిటల్ కి వెళ్ళింది. అక్కడి డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలు చేయగా అసలు విషయం బయటపడింది. మేఘనకు O పాజిటివ్ కి బదులుగా AB పాజిటివ్ రక్తం ఎక్కించారని, అందువల్ల ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యిందని నిర్దారించారు డాక్టర్లు. దీంతో షాక్ కి గురైన బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.