వరంగల్ మెడికవర్​లో తొలిసారి తవీ చికిత్స

 వరంగల్ మెడికవర్​లో తొలిసారి తవీ చికిత్స

ఖిలా వరంగల్ (కరీమాబాద్), వెలుగు: వరంగల్​మెడికవర్​హాస్పిటల్​లో డాక్టర్లు తొలిసారి తవీ చికిత్సను చేశారు. శనివారం హంటర్ రోడ్డులోని హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన చికిత్స కోసమంటూ మెట్రో నగరాలకు వెళ్లాల్సిన పని లేదని, వరంగల్ లోనే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స మెడికవర్ హాస్పిటల్ లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. 

వరంగల్​నివాసి 77 ఏండ్ల వ్యక్తి తకార్డియాక్ సింకోపి(గుండె లయ సక్రమంగా లేకపోవడం, రక్త నాళాలు పూడుకుపోవటం, హార్ట్ వాల్వ్ లో అవరోధాలు) సమస్యతో బాధపడుతున్నారని, ఈ సమస్యలు కలిగిన వారికి వాల్వ్స్ వేయటంతోపాటు బైపాస్ కూడా చేయాల్సి ఉంటుందని అన్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి కారణంగా తవి, పీటీసీఏలను ఒకేసారి చేశామన్నారు. ఈ తరహా చికిత్సకు నైపుణ్యం, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో చేయాలని, మెడికవర్​బృందంతో కలిసి తవి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశానని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు శ్రవణ్ కుమార్, సృజన అల్లాడి, అవనీశ్​పాల్గొన్నారు.