స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ వద్దు..కీసరలో డాక్యుమెంట్ రైటర్ల నిరసన

స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ వద్దు..కీసరలో డాక్యుమెంట్ రైటర్ల నిరసన

కీసర, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ సిస్టమ్​ను వ్యతిరేకిస్తూ.. కీసర సబ్ రిజిస్టర్ ఆఫీస్​లో డాక్యుమెంట్ రైటర్లు నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని కార్యాలయం ముందు బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 144 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దాదాపు 30 వేల మంది డాక్యుమెంట్ రైటర్లు పనిచేస్తున్నారన్నారు.

ప్రభుత్వం స్లాట్ బుకింగ్ పద్ధతిని తీసుకొస్తే తమంతా రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం సబ్ రిజిస్టర్​కు వినతి పత్రం అందజేశారు. రైటర్లు శిరీష, ఆఫీస్, ప్రసాద్, నర్సింగ్, రాజు, చారి , తదితరులు ఉన్నారు.