డోడో..ఇది ప్రపంచంలో ప్రసిద్ధ కుక్కల జాతులతో ఒకటి.. చాలా మంది ఈ జాతి కుక్కులను పెంపుడు కుక్కలుగా పెంచుకునేందుకు ఇష్టపడతారు.. దీని ఖరీదు కూడా ఎక్కువే.. అయిప్పటికీ కొంటుంటారు.. అయితే ఈ జాతికి చెందిన ఓ కుక్క పెంచుకుంటూ.. దానికి రెండు కాళ్లపై నడిచేలా ట్రైనింగ్ ఇచ్చాడు..డోడో తో బుడిబుడి అడుగులు వేయించాడు.
డోెడో ముందు రెండు కాళ్లు పైకి లేపి.. వెనక కాళ్లతో నడుస్తుంటే.. అచ్చు అప్పుడే నడవడం నేర్చుకున్న చిన్నారి పరుగులా ఉంది. ఈ డోడో కుక్క వీధుల్లో పరుగులు పెడుతుంటే.. చూసే వారు సెల్ఫీలకోసం వెంట పడుతున్నారంటే.. దాని నడక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
The Dodo, one of the most famous dogs in the world, learned to walk.
— The Best (@ThebestFigen) August 23, 2024
pic.twitter.com/yDFvtl2cGF
డోడో కుక్క పరుగులు, నేను నడక నేర్చుకున్నానోచ్ అన్నట్లు దాని చూపులు.. ఇదంతా చూసిన జనం.. దానితో సెల్ఫీ లు దిగేందుకు వెనకాలే పరుగులు పెడుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.
డోడో కుక్క వీధుల్లో నడుస్తూ.. పరుగులు పెడుతూ ఉంటూ చూపరులను దాని వెంటపడి సెల్ఫీలు, వీడియోలు తీసుకునేలా ఆకట్టుకుంది.. అంతేకాదు.. సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లంతా డోడో కుక్క పరుగులకు ఫిదా అయిపోయారు.. లైకులు, కామెంట్ల రూపంలో డోడో డాగ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.