మీరు ఐఫోన్ వాడుతున్నారా.. త్వరగా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందా.. అయితే దీనికి ఓ ట్రిక్ ని మీకోసం అందిస్తున్నాం. దీని సహాయంతో బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిన పని కేవలం సెట్టింగ్ లలో కొంచెం మార్పులు చేయడమే.
సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోతే అన్ని పనులు ఆగిపోతాయి. ముఖ్యంగా బయటకు వెళ్లినపుడు ఫోన్ డిశ్చార్జ్ అయిపోతే టెన్షన్ పెరుగుతుంది. ఫోన్ కొత్తదైతే బ్యాటరీ అంత వేగంగా తగ్గదు. కానీ అది పాతబడటం మొదలైనప్పటినుంచి బ్యాటరీ వేగంగా తగ్గడం ప్రారంభిస్తుంది. ఐఫోన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దాని బ్యాటరీ రోజంతా కూడా ఉండదని ఇందువల్ల దానితోపాటు ఛార్జర్ ను తీసుకెళ్లాల్సి వస్తుందని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు.
మీరు ఈ సమస్యనుంచి బయటపడేందుకు ఐఫోన్ బ్యాటరీని మునుపటి కంటే ఎక్కువ సేపు ఛార్జింగ్ ఉండేలా కొన్ని మార్గాలున్నాయి. ఐఫోన్ కొన్ని సెట్టింగులను మార్చడం ద్వార బ్యాటరీని ఎలా సేవ్ చేయవచ్చో తెలుసుకుందాం.
స్క్రీన్ బ్రైట్ నెస్ : స్క్రీన్ బ్రైట్ నెస్ ఐఫోన్ బ్యాటరీని చాలా వేగంగా ఖాళీ చేస్తుంది. కంట్రోట్ సెంటర్ నుంచి ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ ను తగ్గించవచ్చు. మీ ఫోన్ స్క్రీన నుంచి కుడి ఎగువ నుంచి క్రిందికి స్వైప్ చేయండి.. ప్రకాశం స్లయిడర్ ను క్రింది లాగండి.
దీని కోసం సెట్టింగులకు వెళ్లి ఆపై యాక్సెస్ బిలిటీకి వెళ్లి ఇక్కడ నుంచి డిస్ ప్లే టెక్ట్స్ లోకి వెళ్లి సెల్ఫ్ బ్రైట్ ని నిలిపివేయాలి. డిసేబుల్ చేయడం వల్ల బ్రైట్ నెస్ పెరగదు. బ్యాటరీ వినియోగాన్ని తగ్గిస్తుంది.
డార్క్ మోడ్: OLED డిస్ ప్లే లు ఉన్న ఫోన్లకు డార్క్ మోడ్ కు మారడం ప్రయోజనకరంగా ఉంటుంది. డార్క్ మోడ్ లోకి మారడం బ్యాటరీ లైఫ్ మెరుగుపరుస్తుంది. దీనికోసం Settings >Display Brightness>Darkని నొక్కడం ద్వారా బ్యాటరీ లైఫ్ ను మెరుగుపర్చవచ్చు.
తక్కువ పవర్ మోడ్: తక్కువ పవర్ మోడ్కి మారినప్పుడు మీ ఐఫోన్ కొన్ని ఫీచర్లు డియాక్టివేట్ చేయబడతాయి. ఉదాహరణకు మీ ఐఫోన్ లో పీపుల్ పవర్ మోడ్ ని ఆన్ లో ఉంచినట్లయితే ఆటోమేటిక్ డౌన్ లోడ్లు, iCloud బ్యాకప్, ఈ మెయిల్ లు రావు. ఈ సెట్టింగ్ ని ఆన్ చేయడానికి Settings >Battory>Power Mode ని ఆన్ చేయాలి.
నోటిఫికేషన్లు: కొన్ని సార్లు ప్రతి యాప్ నుంచి తరుచుగా వచ్చే నోటిఫికేషన్ల కారణంగా బ్యాటరీ వినియోగం వేగంగా జరుగుతుంది. అందువల్ల మీకు ఎక్కువ అవసరం లేని వాటి నోటిఫికేషన్లను ఆఫ్ చేయాలి.
ఈ విధంగా మీ ఐఫోన్ లో మార్పులు చేస్తే బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది... ఎక్కువ కాలం ఛార్జింగ్ ఉంటుంది.