చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా?..ఇందులో నిజమెంత

సాధారణంగా మనకు జలుబు చేస్తే..కొంతమంది చికెన్ సూప్ పెట్టుకొని తాగండి..జలుబు తగ్గుతుందని సలహాలు ఇస్తుంటారు. జలుబు నుంచి ఉపశమనం పొంద డానికి చికెన్ సూప్ సహకరిస్తుందని తాతల కాలం నుంచి నమ్ముతూనే వస్తున్నాం. అనారోగ్యంగా ఉన్నపుడు చికెస్ సూప్ తీసుకుంటే మానసికంగా కూడా ఉపశమనం పొందినట్లు అనిపించడం నిజమేనా..అసలు వేడివేడి చికెన్ సూప్ తాగితే నిజంగానే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందా? తెలుసుకుందాం. 

అనారోగ్యానికి చికిత్సగా చికెన్ సూప్ ను తీసుకోవడం అనేది ఎప్పటినుంచో ఉంది. రోమన్ చక్రవర్తుల దగ్గర సైనికులకు ఆపరేషన్ల చేసే గొప్ప వైద్యుడిగా పేరున్న పెడానియస్ డియోస్కోరైడ్స్ రాసిన వైద్యవిధానాల్లో కూడా చికెన్ సూప్ గురించి ఉందట.

సాధారణంగా అనారోగ్యంగా ఉంటే ఏమీ తినబుద్ది కాదు. తీపి, ఉప్పు, వగరు, చేదులతో పాటు మాంసపు రుచి(యుమామి)తో కూడిన సూప్ను సేవించడం నోటికి ఎంతో రుచిగా ఉంటుందని అని నిపుణులు అంటున్నారు. ఉడికిన చికెన్ , కూరగాయాలు, మసాలా దినుసులతో  తయారు చేసిన వేడి వేడి సూప్ చాలా ఉపయోగం అని అంటున్నారు. 

యుమామి రుచి గల చికెన్ సూప్..మన శరీరానికి అమినో యాసిడ్లు..ప్రోటీన్లను అందించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. చికెన్ సూప్ లాంటి పదార్థాల్లో అమినో యా సిడ్ ఉటుంది. అయితే కేవలం చికెన్ లాంటి మాంసంలో మాత్రమే కాదు..చీజ్, మష్రూమ్స్, మీసో, సోయాసాస్ వంటి పదార్థాల్లోనూ ఈ మాంసపు రుచిని అంది స్తాయి. ఈ ఉమామి రుచి వల్ల చికెన్ సూప్ తీసుకుంటే ఉపశమనం కలగడానికి కారణం అని అధ్యయనాల్లో కూడా తేలింది.

జలుబే కాదు..ఆకలి కూడా పెంచుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఆకలి లేదన్న వారు చికెన్ సూప్ తీసుకున్న సమయంలో తమకు ఆకలిగా అనిపించినట్లు తెలిపారని పరిశోధకులు చెప్తున్నారు. ఈ ఉమామి రుచిగల పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందుతాయని తేలింది. మెదడులో ఉండే నరాలు ఉత్తేజితమై నాలుకకు రుచి తెలియజేస్తాయని..శరీరం కూడా ఎక్కువ ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు సిద్దమై ఎక్కువ ప్రోటీన్ల ను శోషించు కుంటుంది. 

వాపు, ముక్కు దిబ్బడ నుంచి.. 

శ్వాసకోసం సంబంధిత అనారోగ్యం తలెత్తినప్పుడు శరీరంలోని తెల్లరక్తకణాలు రక్తంలో కలిసి ప్రభావం చూపుతాయి. జలుబు, ఫ్లూ, ముక్కుదిబ్బడ, దగ్గు, ముక్కు చీదడం, మందపాటి శ్లేష్మం వంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి. తెల్ల రక్తకణాలు నెమ్మదిస్తే కానీ ఆ ప్రభావం తగ్గదు. ఈ పని చికెన్ సూప్ చేస్తుంది. చికెన్ సూప్ నుంచి వచ్చే వాసన చూడటం వల్ల ముక్కు, శ్వాసకోవ నాళాల ఉష్ణ్రోగతలు కూడా పెరుగుతాయి. దీంతో అందుకే చికెన్ సూప్ తాగితే వాపు, ముక్కు దిబ్బడ, జలుబు తగ్గుతాయంటున్నారు నిపుణులు. 

ఇంట్లోనే చికెన్ సూప్ తయారు చేసుకుంటే మంచిది. దినుసులు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయాలు, తగినంత మసాల వేసుకొని తయారు చేసుకుఃనే చికెన్ సూప్ ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ఫైనల్ చెప్పేది ఏమిటంటే.. చికెన్ సూప్ జలుబును పూర్తిగా తగ్గించలేదు.. రోగికి ఉపశమనం మాత్రమే కలిగించగలదని అంటున్నారు నిపుణులు.