
KRMB కి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు అప్పగించమని స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటివాటాలు కాపాడటంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కృష్ణా నీళ్లు తెలంగాణకు ప్రధాన జీవనాధారం అని చెప్పిన మంత్రి.. 299 టీఎంసీలు తెలంగాణ వాటాగా బీఆర్ఎస్ ఒప్పుకుందన్నారు . అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై చర్చ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఉమ్మడి ఏపీలో కంటే పదేళ్లలో గత పాలకుల అశ్రద్ధ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 0 శాతం ఎక్కువ నీళ్లను ఆంధ్రా వాళ్లు తీసుకెళ్లారన్నారు. పాలమూరు రంగారెడ్డికి రూ.27 వేల 500కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే పోత్తిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారన్నారు ఉత్తమ్ . 2015నుంచి 2023 వరకు కృష్ణానదీ జలాల్లో ఆంధ్రాకు ఎక్కువ నీళ్లు అప్పగించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారన్నారు.