కారు భద్రతాపరంగా ఎయిర్ బ్యాగులు ఎంత ముఖ్యమో మనందరికి తెలుసు.. ఇవి పెద్ద ప్రమాదాల నుంచి కూడా సులభంగా మన ప్రాణాలను రక్షిస్తాయి. కారులో ఎయిర్ బ్యాగులు ఉన్నట్లయితే ప్రమాద సమయంలో తీవ్ర గాయాలను నివారించవచ్చు. అయితే ఎయిర్ బ్యాగులు తెరుచుకోవాలంటే.. సీటు బెల్ట్ పెట్టుకోవాలా వద్దా? చాలామందికి ఈ సందేహం కలుగుతుంది. ఇంతకీ సీటు బెల్టు పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగులు పనిచేస్తాయా.. నిజం ఏం టో తెలుసుకుందాం..
ప్రమాద సమయాల్లో సీటు బెల్ట్ కూడా మనల్ని రక్షించడంతో కీలకంగా పనిచేస్తుంది. అయితే ఎయిర్ బ్యాగ్ పనిచేయడాకి కూడా సీటు బెల్ట్ సరిగా పరిచేయడం చాలా ముఖ్యం. కారు అకస్మాత్తగా ఆడిపోయినప్పుడు, సీట్ బెల్ట్ ప్రయాణికులను పడిపోకుండా నిలువరిస్తుంది. అధిక వేగంతో ఎయిర్ బ్యాగుకు డ్యామేజ్ కాకుండా చేస్తుంది. సీట్ బెల్ట్ ను పెట్టుకోవడంతో ఎయిర్ బ్యాగును సమర్ధవంతంగా తెరుచుకునేలా చేసి ప్రయాణికుడికి రక్షణ కల్పిస్తుంది.
సీటు బెల్ట్ ధరించకపోతే ఢీకొన్న సమయంలో ఆవ్యక్తి స్థానం నుంచి బయటపడే ప్రమాదం ఉంది. ఇది ఎయిర్ బ్యాగ్ స్థానం నుంచి ప్రయాణికుడిన పక్కకు జరుపుతుంది. దీంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది.
మొత్తానికి ఎయిర్ బ్యాగు సరైన పనితీరును ప్రదర్శించాలంటే ప్రమాద సమయంలోప్రయాణికుల భద్రత కోసం సీట్ బెల్ట్ ధరించడం చాలా ముఖ్యం. ఇది కాకుండా కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టట్ ధరించకపోవడం మన దేశంలో చట్టవిరుద్ధం కూడా. చట్టాన్ని గౌరవించడం స్వంత భద్రత కోసం ఎయిర్ బ్యాగ్ ను పనితీరును మెరుగుపర్చడం కోసం తప్పకుండా సీటు బెల్ట్ ధరించడం చాలా ముఖ్యం.