ఫోన్‌ కాల్స్‌ వింటున్నరు.. యాడ్స్ గుప్పిస్తున్నరు

  • పేర్కొన్న 53 శాతం మంది రెస్పాండెంట్లు
  • మైక్రోఫోన్‌‌‌‌ను ఎక్కువగా యాక్సెస్ చేస్తున్న యాప్‌‌లు, వెబ్‌‌సైట్‌‌లు    లోకల్ సర్కిల్ సర్వేలో వెల్లడి
     

స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లు మీ ప్రైవేట్ ఫోన్ కాల్స్‌‌‌‌ వింటున్నాయి! వినడమే కాదు వెబ్‌‌‌‌సైట్లలో, యాప్‌‌‌‌లలో మీ సంభాషణలకు తగ్గ యాడ్స్‌‌‌‌ను ఇస్తున్నాయి. సింపుల్‌‌‌‌గా చెప్పాలంటే మీరు టీవీ తీసుకుందామని మాట్లాడుకుంటే టీవీ యాడ్స్‌‌‌‌ మీకు కనిపిస్తుంటాయి. సెర్చ్‌‌‌‌ చేస్తున్న వెబ్‌‌‌‌సైట్లలో, యాప్‌‌‌‌లలో  ప్రైవేట్ కాల్స్‌‌‌‌కు రిలేటెడ్ యాడ్స్ కనిపిస్తున్నాయని 53 శాతం మంది రెస్పాండెంట్లు అన్నారని లోకల్‌‌‌‌ సర్కిల్ వివరించింది. మొత్తం 307 జిల్లాలకు చెందిన 38 వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేను చేసింది. తమ ఫోన్ సంభాషణలకు అనుగుణంగా యాడ్స్ రావడం చూస్తున్నామనే కామెంట్స్‌‌‌‌ ప్రజల నుంచి పెరిగాయని లోకల్ సర్కిల్ పేర్కొంది. అందుకే ఈ సర్వే చేశామని వివరించింది. స్మార్ట్‌‌‌‌ఫోన్లలోని కనీసం 84 శాతం యాప్‌‌‌‌లు  మన కాంటాక్ట్ లిస్టును, మైక్రోఫోన్‌‌‌‌ను యాక్సెస్‌‌‌‌ చేసుకోవడానికి పర్మిషన్స్‌‌‌‌ అడుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని యాప్స్ అయితే  ఈ పర్మిషన్స్ లేకపోతే పనిచేయడం లేదు కూడా. వాట్సాప్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌, ట్రూకాలర్‌‌‌‌‌‌‌‌ వంటి యాప్స్‌‌‌‌ మైక్రో ఫోన్‌‌‌‌ను యాక్సెస్ చేస్తున్నాయి. ముఖ్యంగా జూమ్‌‌‌‌, స్కైప్‌‌‌‌, గూగుల్ మీట్‌‌‌‌ వంటి ఆడియో లేదా వీడియో కాలింగ్ యాప్స్‌‌‌‌, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, ట్విటర్ వంటి సోషల్ మీడియా యాప్స్‌‌‌‌ యూజర్ల  మైక్రోఫోన్‌‌‌‌ను యాక్సెస్ చేసుకోవడానికి ఎక్కువగా పర్మిషన్‌‌‌‌ అడుగుతున్నాయి.              

 

ప్రైవసీకి భంగమే..
టెక్నాలజీ  అడ్వాన్స్ అవ్వడంతో ప్రజల జీవితాలు మరింత సుఖంగా మారాయి. అయినప్పటికీ,  ప్రజల ప్రైవసీకి భంగం కలుగుతోందని చెప్పొచ్చు. వివిధ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లు, యాప్‌‌‌‌లు  యూజర్ల డేటాను సేకరించడం వాటిని థర్డ్ పార్టీ కంపెనీలతో షేరు చేసుకోవడం పెరుగుతోంది. ఈ థర్డ్ పార్టీ కంపెనీలు యూజర్ల సంభాషణలను, వారి వెబ్‌‌‌‌ సెర్చ్ హిస్టరీని, ఇతర పర్సనల్ డేటా ఆధారంగా  టార్గెట్‌‌‌‌ యాడ్స్‌‌‌‌ను ఇస్తున్నాయి. యూజర్ల పర్సనల్ డేటా కొన్ని సార్లు హ్యాకర్లు, సైబర్ క్రిమినల్స్ చేతిల్లోకి వెళుతున్నాయి కూడా.  ఫిషింగ్‌‌‌‌, మాల్వేర్‌‌‌‌‌‌‌‌ అటాక్స్‌‌‌‌ వంటివి పెరుగుతున్నాయి. యూజర్ల డేటాను దొంగిలించాక తప్పుడు పనులకు ఈ డేటాను సైబర్ నేరగాళ్లు వాడుతున్నారు.  లోకల్ సర్కిల్ సర్వే ప్రకారం, 53 శాతం మంది తమ ఫోన్ సంభాషణలకు రిలేటెడ్‌‌‌‌గా ఉన్న యాడ్స్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లు లేదా యాప్‌‌‌‌లలో కనిపిస్తున్నాయని చెప్పారు. చాలా మంది యూజర్లకు యాప్‌‌‌‌లు  ఎందుకు మైక్రోఫోన్‌‌‌‌  పర్మిషన్‌‌‌‌ అడుగుతాయో తెలియదని, సేకరించిన డేటాను ఎవరితో పంచుకుంటున్నాయో తెలియదని లోకల్ సర్కిల్ పేర్కొంది. ఉదాహరణకు గేమింగ్ యాప్‌‌‌‌లు యూజర్ల మైక్రోఫోన్‌‌‌‌ను యాక్సెస్ చేస్తాయి. కొన్ని యాప్‌‌‌‌లు యూజర్ల ప్రైవేట్ సంభాషణలను రికార్డ్ చేసి వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయి. ఫోన్ మాట్లాడేటప్పుడు యాప్‌లకిచ్చిన  మైక్రోఫోన్‌‌‌‌ పర్మిషన్లను  ఆఫ్ చేస్తే సరిపోతుంది. కానీ, చాలా యాప్స్ మైక్రోఫోన్ యాక్సెస్ లేకపోతే పనిచేయడం లేదని లోకల్‌‌‌‌ సర్కిల్ వివరించింది. లోకల్ సర్కిల్ సర్వే ప్రకారం, ఫోన్‌‌‌‌లోని మొత్తం యాప్‌‌‌‌లకు మైక్రోఫోన్ పర్మిషన్‌‌‌‌ను ఇచ్చామని 9 % మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. కేవలం ఆడియో, వీడియో యాప్స్‌‌‌‌కు ఇచ్చామని 18 % మంది, సోషల్ మీడియా, మ్యూజిక్, ఆడియో వీడియో రికార్డింగ్ యాప్స్‌‌‌‌కు మైక్రోఫోన్ పర్మిషన్ ఇచ్చామని 11% మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. వాయిస్‌‌‌‌ ద్వారా ఫోన్‌‌‌‌ను వాడడంలో సాయపడే యాప్స్‌‌‌‌కు మైక్రోఫోన్ పర్మిషన్‌‌‌‌ ఇచ్చామని 4 % మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. తమ కాంటాక్ట్‌‌‌‌ లిస్టును యాక్సెస్‌‌‌‌ చేసుకోవడానికి వాట్సాప్‌‌‌‌కు పర్మిషన్ ఇచ్చామని 84 శాతం మంది,  ఫేస్‌‌‌‌బుక్ లేదా ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌కు లేదా రెండింటికి ఇచ్చామని 51% మంది, ట్రూకాలర్ వంటి యాప్స్‌‌‌‌కు ఇచ్చామని 41% మంది పేర్కొన్నారు. కాగా, దేశంలోని ప్రజల డేటా ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం పర్సనల్ డేటా ప్రొటక్షన్‌‌‌‌ బిల్లు–2019 ని తీసుకురావాలని చూస్తోంది. ఈ బిల్లుకు పార్లమెంట్‌‌‌‌లో ఇంకా ఆమోదం రాలేదు.

మరిన్ని వార్తల కోసం : -

కొనుగోలు సెంటర్లలోనే వడ్ల బస్తాలకు చెదలు


గాంధీలో ఐవీఎఫ్‌‌ ల్యాబ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు