బాసర ఎంపిపిపై కుక్క దాడి

కాలికి తీవ్ర గాయాలు

భైంసా : నిర్మల్ జిల్లా బాసర మండలంలో కుక్కలు రెచ్చిపోతున్నాయి. గత ఐదు రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన. తాజాగా శుక్రవారం బాసర మండలం బిద్రేల్లి గ్రామంలో ఎంపీపీ  సునీత భర్త, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ విశ్వనాథ్ పటేల్ పై కుక్క దాడి చేయడంతో కాలికి తీవ్ర గాయమైంది. ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. బాసరలో మేక పిల్లలు చంపిన కుక్కలు రెండ్రోజుల క్రితం ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థులపై దాడి చేశాయి. కుక్క దాడితో మండల వసూలు భయాందోళనకు గురవుతున్నారు.