
చండ్రుగొండ, వెలుగు: మండలంలోని రావికంపాడు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కుక్కలు దాడిలో 12 గొర్రెలు మృతి చెందాయి. రావికంపాడు గ్రామానికి చెందిన రైతు ఆనంగి పెద్దపకీర్ గొర్రెలను ఇంటికి దూరంగా ఉన్న పశువుల పాకలో ఉంచాడు.
బుధవారం అర్ధరాత్రి సమయంలో కుక్కల గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో 12 గొర్రెలు మృతి చెందాయి. గురువారం ఉదయం పశువుల పాక వద్దకు వెళ్లిన ఫకీర్ కు గాయపడి మృతి చెందిన గొర్రెలు కనిపించాయి. వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు.