జనగామ జిల్లాలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి చేశాయి. నర్మెట్ట మండలంలోని మల్కాపేట గ్రామానికి చెందిన బానోతు బిజన్ అనే ఐదేళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు అతనిపై విచక్షణ రాహితంగా దాడిచేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో బాలుడ్ని వెంటనే జనగామ ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. బాలుడి పరిస్థితిపై వైద్యులను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా డ్యూటీ డాక్టర్ దీపిక స్పందించలేదు.