కుక్కలు లేని దేశం ఏదైనా ఉందా అంటే.. ఇక నుంచి ఉండబోతుంది.. ఆ దేశం టర్కీ.. అవును డాగ్ ఫ్రీ కంట్రీ అంటూ కొత్త చట్టం తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు ఉన్న కుక్కలను ఏం చేయబోతున్నారు.. వాటిని ఏం చేయాలని అనుకుంటున్నారు అనే సంచలన విషయాలు మీ కోసం..
లక్షలాది వీధికుక్కలను పట్టి వాటిని షెల్టర్లలో పెట్టాలని టర్కీ పార్లమెంట్ మంగళవారం జూలై 30, 2024న ఓ బిల్లును ఆమోదించింది. టర్కీలో ఉన్న దాదాపు 4మిలి యన్ల కుక్కలను పట్టి షెల్టర్లకు తరలించాలని ఈ చట్టంలోని సారాంశం. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పార్టీ ప్రతిపాదించిన చట్టం ప్రకారం.. మున్సిపాలిటీలు వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే కుక్కులను పట్టి షెల్టర్లలో పెట్టాలి. చికిత్స నయంచేయలేనివ్యాధులున్న కుక్కలను నిర్మూలించాలి. అయితే ఈ చట్టాన్ని జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేపట్టారు.
గతంలో టర్కీ కుక్కల చట్టాలు
ఇంతకుముందు కూడా టర్కీలో కుక్కల చట్టాలున్నాయి. మున్సిపాలిటీలు వీధి కుక్కలన్నింటికి క్రిమీ సంహారక , టీకాలు వేయాలి. చికిత్స తర్వాత వాటిని గుర్తించిన చోట వదిలివేయాలి. టర్కీ లెక్కల ప్రకారం.. ఆ దేశంలో 4 మిలియన్లు కుక్కులన్నాయి.మున్సిపాలిటీలు గత 20 యేళ్లలో 2.5 మిలియన్ల కుక్కలను ఆరోగ్యంగా తీర్చిదిద్దాయి. అయితే ఈ కొత్త చట్టం ప్రకారం.. ఒక్కో సంరక్షణ కేంద్రంలో లక్షా 5వేల కుక్కలను పర్యవేక్షించేలా మొత్తం 322 జంతు సంరక్షణా కేంద్రాలున్నాయి.
మున్సిపాలిటీల వార్షిక బడ్జెట్ లో కనీసం 0.3 శాతం జంతు పునరావాస సేవలు, బిల్డింగ్ షెల్టర్లకోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలు కొత్త షెల్టర్లను నిర్మించడానికి ప్రస్తుత షెల్టర్లను మెరుగు పర్చేందుకు 2028 సంవత్సరం వరకు లక్ష్యంగా పెట్టుకున్నారు.
జంతు ప్రేమికులు నిరసనలు
ఇస్తాంబుల్ లోని సిషానే స్క్వేర్ లో వందలాది మంది గుమికూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నా లు చేశారు. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యంగా ఉన్న జంతువులను చంపకూడదని ..ఈ చట్టం ద్వారా వాటిని ఎందుకు సేకరిస్తు న్నా రని పీపుల్స్ పార్టీ సీనియర్ డిప్యూటీ మురాత్ ఎమిర్ ఆదివారం పార్లమెంట్ లో తీవ్రంగా స్పందించారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది కూడా.