బీచ్ వాలీబాల్ ప్లేయర్గా కుక్క (వీడియో)

ఓ శునకం వాలీబాల్ను రఫ్ఫాడిస్తోంది. ఖతర్నాక్గా వాలీబాల్ ను టైమింగ్ చేస్తోంది. ఫ్రొఫెషనల్ ప్లేయర్లను తలదన్నేలా బీచ్ వాలీబాల్ ఆడుతోంది. బంతిని కిందపడనీయకుండా  కరెక్ట్గా పుష్ చేస్తోంది. ఎలాంటి షాట్ను అయినా అవలీలగా స్వీకరిస్తూ..అద్బుతంగా బంతిని మరో ప్లేయర్ కు అందిస్తోంది. బీచ్ లో వాలీబాల్ ఆడుతున్న కుక్క వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. 

మన ఇండ్లలో పెంపుడు జంతువులతో ఆటలాడటం కామన్. ముఖ్యంగా కుక్కలకు మనం ఏదైనా వస్తువునుగానీ, బాల్ను గానీ విసిరివేస్తే..అవి పరుగెత్తుకుంటూ వెళ్లి తెచ్చిస్తుంటాయి. కొన్నిసార్లు నోటితో క్యాచ్ పడుతుంటాయి. అయితే ఇక్కడ ఓ కుక్క మాత్రం..బీచ్ వాలీబాల్ ప్లేయర్గా మారి...వాలీబాల్ ఆడుతోంది. 

వీడియోలో ఏముంది?

ఒక నిమిషం వీడియోలో ఓ కుక్క బీచ్ వాలీబాల్ ఆడుతున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.  ముగ్గురు వ్యక్తులతో కలిసి ఓ కుక్క బీచ్ వాలీబాల్ ఆడుతోంది.  ముందుగా ఓ వ్యక్తి బంతిని అటు వైపు నుంచి సర్వ్ చేస్తాడు.  ఇవతలి వైపు ఉన్న వ్యక్తి..బంతిని తలతో రిసీవ్ చేసుకుని..కుక్కకు పాస్ చేస్తాడు. ఆ బంతిని అద్భుతంగా స్వీకరించిన కుక్క...మళ్లీ తన టీమ్ మేట్ కు నోటితో ఫుష్ చేస్తుంది. అతను తిరిగి బంతిని అవతలి వైపునకు పంపిస్తాడు.

ALSO READచైనా అధ్యక్షుడు వస్తే ఇంకా బాగుంటుంది.. : జీ 20 సమ్మిట్ పై జో బైడెన్

మళ్లీ అదే బంతిని తిరిగి వస్తుంది. టీమ్ మేట్ ఆ బంతిని స్వీకరించి..మళ్లీ కుక్కకు పాస్ చేస్తాడు. ఆ బంతిని అద్బుతంగా నోటితో హిట్ చేస్తుంది కుక్క. దాన్ని స్వీకరించిన వ్యక్తి..అంతే వేగంతో మళ్లీ ప్రత్యర్థి టీమ్కు పాస్ చేస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఓ శునకమా..ఔర ఔర..

ఈ వీడియోను ఇప్పటి వరకు 3.2 మిలియన్ల మంది వీక్షించారు. 65 వేల మందికిపైగా లైక్స్ కొట్టారు. బీచ్ వాలీబాల్ ఆడుతున్న కుక్కపై  నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. వావ్ ఈ కక్క సూపర్ అంటూ కొందరు కామెంట్స్ చేయగా..మరికొందరు..ఫ్రొఫెషనల్ ప్లేయర్ల కంటే బెటర్ అంటూ కితాబిస్తున్నారు. ఇంకొందరైతే  ఈ కుక్కను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని సూచిస్తున్నారు.