
వరంగల్ సిటీ, వెలుగు : హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ దగ్గరలోని హనుమాన్ నగర్లో వీధి కుక్క దాడిలో ఓ బాలుడికి గురువారం గాయాలయ్యాయి. మహమ్మద్ వాహిదుల్లా (7) అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది.
దీంతో బాలుడు కేకలు వేయడంతో స్థానికులు గమనించి కుక్కను తరిమివేయడంతో బాలుడికి ప్రాణపాయం తప్పింది. వెంటనే బాలుడిని ట్రీట్మెంట్ కోసం ఎంజీఎం
తరలించారు.