వీధుల్లో జనాలు కనిపిస్తే చాలు.. కుక్కలు వెంటపడుతున్నాయి. కండలు పీకేస్తున్నాయి. రాత్రి పగలూ అన్న తేడా లేకుండా తమ ప్రతాపం చూపిస్తున్నాయి. దీంతో పిల్లలు, పెద్దవాళ్లు వీధుల్లోకి ఒంటరిగా రావాలంటే గజగజ వణికిపోతున్నారు. ఈ మధ్య కుక్కల దాడులకు సంబంధించిన ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేశాయి.
నిజామాబాద్ జిల్లా గాయత్రి నగర్ మిర్చి కాంపౌండ్, కోటగల్లీల్లో 12 మందిపై కుక్కలు దాడి చేశాయి. ఈ బాధితుల్లో 10 మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలయిన వారందరిని ఆసుపత్రికి తరలించారు. కుక్కల దాడులతో స్థానికులు భయాందోళనకు గురవతున్నారు. కుక్కల బెడద నుంచి తమను రక్షించుకోవాడానికి స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కుక్కల దాడులను నియంత్రించేందుకు స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.