హైదరాబాద్ లో మరోసారి రెచ్చిపోయిన వీధి కుక్కలు

హైదరాబాద్ లో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. కూకట్ పల్లిలోని దయార్గుడలో బాలుడిపై వీధి కుక్కలు దాడిచేశాయి. రోడ్డుపై ఆడుకుంటున్న మయాంక్ అనే బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. 

చెంప, దవడ భాగం మొత్తం తీవ్రగాయాలయ్యాయి. బాలుడిని హస్పటల్ కి తరలించి చికిత్స అందించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. 

ఈ ఘటనలపై గతంలో ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

ALSO READ :ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం.. మాగుంట రాఘవకు బెయిల్