సంగారెడ్డిలో బీభత్సం .. ఒకేసారి బాలుడిపై ఆరు కుక్కలు ఎటాక్

సంగారెడ్డిలో బీభత్సం .. ఒకేసారి బాలుడిపై ఆరు కుక్కలు ఎటాక్

సంగారెడ్డి జిల్లాలో  కుక్కల బీభత్సం సృష్టించాయి. శ్రీనగర్ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ బాలుడిపైన ఏకంగా ఆరు కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడి కేకలు విన్న స్థానికులు కుక్కలను తరిమేందుకు ప్రయత్నించారు.  రాళ్లతో కుక్కలను కొట్టి అక్కడినుంచి తరిమేశారు.  కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  బాలుడిపై కుక్కలు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. వెంబడించి ప్రజలను కరుస్తున్నాయి. 

రాష్ట్రంలో చిన్నారులపై వీధి కుక్కల దాడి ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఇటీవల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకుంటే సరిపోదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయట్లేదని, సరైన ఆహారం లేక మనుషులపై దాడి చేస్తున్నాయని ఓ పిల్ దాఖలైంది