రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లో వీధి కుక్క స్వైరవిహారం చేస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా కరుస్తున్నాయి. వికాస్ నగర్ కాలనీలో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై దాడి చేసిన కుక్కలు మరికొద్దిసేపటికే మరో మహిళపై దాడి చేశాయి.
స్థానికులు గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు కుక్కలు కడవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోవలని కోరుతున్నారు. కుక్క కాటుకు గురైన వారిని బండ్లగూడ జాగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ పరామర్శించారు. బండ్లగూడలో కుక్కలు చాలా ఉన్నాయి వాటిని త్వరలోనే నివారణ చేపడతామని అన్నారు.