చిన్నారిపై కుక్కల దాడి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా కేంద్రంలోని 16వ వార్డు రాజీవ్​ గృహకల్ప ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై మంగళవారం కుక్కలు దాడి చేశాయి. చిన్నారి ఏడుపు విని  కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని కుక్కలను తరిమేశారు. దీంతో పాపకు ప్రాణపాయం తప్పింది. చిన్నారిని గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించారు. కుక్కల బెడద నుంచి కాపాడాలని పలుసార్లు మున్సిపల్ కమిషనర్​కు విన్నవించినా పట్టించుకోలేదని ేవార్డు కౌన్సిలర్ మాచర్ల రాజకుమారి ఆరోపించారు.