జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట్ గ్రామంలో క్యాతం అబ్రహం అనే వ్యక్తిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో అబ్రహం తీవ్రంగా గాయపడడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జగదేవ్ పేట్ గ్రామంలో గత ఇరవై రోజుల క్రితం పిచ్చి కుక్కల దాడిలో ఒకరు మృతిచెందారు. సుమారు 30 మందికిపైగా గాయపడ్డారు. గ్రామంలో కుక్కులు మనుషులపై దాడులు చేస్తున్నా.. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని జగదేవ్ పేట్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ :అన్నదమ్ముల మధ్య గొడవ.. ఆపడానికి వెళ్లిన యువకుడు మృతి