వీధి కుక్కల స్వైర విహారం.. 15 మందికి గాయాలు

జగిత్యాల జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి.. పగలు అనే తేడా లేకుండా దాడి చేస్తున్నాయి. వీధుల్లో ఆడుకుంటున్న  చిన్నారులపై కుక్కలు రెచ్చిపోతున్నాయి. దీంతో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. టీఆర్ నగర్ లో 10 రోజుల వ్యవధిలో 15 మంది చిన్నారులను శునకాలు గాయపరిచాయి. దీంతో స్థానికులు భయాందోనలకు గురవుతున్నారు.

పట్టణంలోని టీఆర్ నగర్ లో గుంపులు గుంపులుగా తిరిగే కుక్కలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కుక్కల దాడుల వల్ల వీధుల్లో చిన్నారులు ఒంటరిగా తిరగాలంటే జంకుతున్నారని అంటున్నారు. వెంటనే కుక్కల దాడిని అరికట్టడానికి నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను కోరారు.