
వికారాబాద్, వెలుగు : అనంతగిరిలో వీధి కుక్కలు జింకలను చంపి తింటున్నాయి. గురువారం ఉదయం అనంతగిరి ఆలయ పుష్కరిణి సమీపంలో వీధి కుక్కలు జింకను వెంటాడి చంపి తిన్నాయి. అనంతగిరిలో వీధి కుక్కలు పదుల సంఖ్యలో ఉండగా.. ఉదయం అడవిలో తిరుగుతూ కనిపించిన మూగ జీవాలను వెంటాడి చంపుతున్నాయి. అటవీ శాఖ అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి జింకలు, అడవి జంతువుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.