దాహం తీర్చుకోవడానికి ఓ కుక్క నానాతంటాలు పడింది. ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ వాటర్ కాన్ లో నీళ్లు కనబడడంతో.. దాహం తీర్చుకుందామని అందులో తలపెట్టి ఇరుక్కుపోయింది. దీంతో కుక్క నరకం చూసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెంకట్రావ్ పెట్ లో చోటు చేసుకుంది.
మండుతున్న ఎండలతో దాహం తీర్చుకోవడానికి ఓ కుక్క ప్లాస్టిక్ వాటర్ కాన్ లో తల పెట్టింది. నీళ్లుతాగిన తర్వాత తల బయటకు రాకపోవడంతో నానా తంటాలు పడింది. అటు ఇటు పరుగెత్తుతూ.. ఆగమాగం చేసింది. కాన్ నుంచి తలను బయటకు తీయలేక నరకయాతన అనుభవించింది. శునకం పడుతున్న ఇబ్బందులు చూసిన స్థానికులు ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ కాన్ ను తొలగించారు. దీంతో కుక్క ఊపిరిపీల్చుకుంది. ఈ ఘటనను ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. వీడియో వైరల్ అయ్యింది.